వరంగల్‌లో రంజీ మ్యాచులు

వరంగల్‌లో రంజీ మ్యాచులు– హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌
వరంగల్‌ : ప్రతి జిల్లా కేంద్రంలో మినీ స్టేడియాలు సహా వరంగల్‌లో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ ప్రమాణాలతో కొత్త స్టేడియం నిర్మిస్తామని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 కేంద్రాల్లో నిర్వహిచిన వేసవి శిక్షణ శిబిరాలు సోమవారం ముగిశాయి. వరంగల్‌ సమ్మర్‌ క్యాంప్‌ ముగింపు వేడుకలకు హాజరైన జగన్‌.. క్రికెటర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. రానున్న సీజన్‌లో వరంగల్‌లో రంజీ మ్యాచులు నిర్వహిస్తామని, ఈ విషయంపై త్వరలోనే అపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.