నేడు రంజిత్‌రెడ్డి నామినేషన్‌

– భారీ ర్యాలీతో కదలనున్న కాంగ్రెస్‌ శ్రేణులు
– లక్ష మందితో సీఎం రేవంత్‌రెడ్డి కార్నర్‌ మీటింగ్‌
– ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కదిలిరానున్న కార్యకర్తలు
– సాయంత్రం 4గంటలకు ర్యాలీ ప్రారంభం
నవతెలంగాణ రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఎంపీ రంజిత్‌రెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నామి నేషన్‌ ప్రక్రియ సందర్భంగా రాజేందర్‌నగర్‌లో పెద్ద ఎత్తున్న ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పా ల్గొననున్నారు. లక్ష మందితో రేవంత్‌రెడ్డి కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించేందుకు కాంగ్రెస్‌ ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలను తరలించేందుకు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ నేత లు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న ర్యాలీ సు మారు 3 కిలో మీటర్ల మేర సాగనున్నట్టు కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసే ప్రసం గంలో చేవెళ్ల ప్రజలకు దిశనిర్దేశం చేయనున్నట్టు కాంగ్రెస్‌ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రధా నమైన సాగునీటి సమస్యకు పరిష్కారం చూపే దిశగా.. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న 111జీవో ఎత్తివేతపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించే అవకాశం ఉందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. జిల్లాలో ఈ రెండు ప్రాజెక్టుల వైపే ప్రజల చూపు ఉందని భావించిన కాంగ్రెస్‌ నేతలు ఈ రెం డు అంశాలను ప్రధానంగా తీసుకుని ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్నారు. దీనినికి తోడు ఆరుగ్యారెం టీలు అమలులో సాధించిన విజయాలు, ప్రధానంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ రైతు రుణమాఫీపై రైతు లకు భరోసా ఇచ్చే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం ఉండనుందని కాంగ్రెస్‌ తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి కార్నర్‌ మీటింగ్‌తో కాంగ్రెస్‌లో మ రింత జోష్‌ పెరిగే విధంగా ఉండనుంది. ఈ ప్రాంత ప్రజ ల జీవన స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతానికి భవిష్యత్‌లో చేపట్టే అభివృద్ధికి భరోసా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.