
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇనుముల రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నాయకులు రావుల కిషన్ రెడ్డి మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై జగదీష్ కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అతనిపై కేసు నమోదు చేసి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ రాబోయే ఎన్నికల్లో మరోసారి వారికి వారి పార్టీ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్కే పాషా, గంధం సతీష్ పాల్గొన్నారు.