మైనర్ బాలికపై అత్యాచారం ..

– యువకునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు

నవతెలంగాణ – ఆర్మూర్ 

మండలం లోని చేపూర్ గ్రామంలో మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడినటువంటి సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.. వివరాలలోకి వెళితే చేపూరు గ్రామానికి చెందిన  15 సంవత్సరాల బాలిక పై అదే గ్రామానికి చెందిన సంపత్ అనే మైనర్ యువకుడు అత్యాచారానికి పాల్పడినట్టు బాలిక తండ్రి తెలిపాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేపూర్ గ్రామానికి చెందిన మేము రోజువారి కూలీ పనులు చేసుకునే వారిని, అయితే ఏప్రిల్ మూడో తేదీ నాడు ఉదయం అందాజ 9 గంటల ప్రాంతంలో నా కూతురు ఇంటి దగ్గర కళ్ళు తిరిగి కింద పడిపోగా వెంటనే  పట్టణంలో ఒక ఆసుపత్రి లో చూపించగా పరీక్ష చేసినటువంటి డాక్టర్ మూడవ నెల గర్భవతి అని తెలిసింది అని అన్నారు. దీంతో బాలిక తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఒక్కసారిగా విషయం బాధితురాలు తండ్రి ఈ విధంగా తెలిపినారు అదే గ్రామానికి చెందిన సంపత్ అనే యువకుడు 15 సంవత్సరాల నా కూతురైన మైనర్ బాలిక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న నా కూతురిని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లోకజ్ఞానం లేని నా కూతుర్ని సంపత్ అనే యువకుడు గత మార్చి నెలలో మా ఇంటి పక్క ఉన్న సందులోకి బలవంతంగా తీసుకువెళ్లి మానభంగం చేశాడని అదేవిధంగా ఈ విషయాన్ని ఎవరికైనా తెలిపితే చంపేస్తానని బాలికను భయభ్రాంతులకు గురిచేయడం జరిగిందని తెలిపారు . దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు యువకుని పై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు యువకునిపై 183/2024 సెక్షన్376(3)(2)(1),506 ఐపీసీ సెక్షన్ 5(1)2/W 6, ఫోక్సొ 2012 యాక్టివ్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిసింది.. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమని ఇలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని , సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ సంఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరినారు.