
పట్టణ కేంద్రంలోని శ్రీ శివ సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో అరుదైన తుంటే ఎముక శాస్త్ర చికిత్స విజయవంతమైనట్లు డైరెక్టర్ పోడేండ్ల సాయికుమార్ తెలిపారు. మండలంలోని చేయగల గ్రామానికి చెందిన లింబాయి అనే బాధితురాలు తుంటి ఎముక వళ్ళ తీవ్ర ఇబ్బందులకు గురై పలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ తమను సంప్రదించడంతో పరీక్షించి తుంటి భాగంలో బోను అరిగిందని నిర్ధారించి శస్త్ర చికిత్స చేసినట్లు సాయికుమార్ తెలిపారు. కార్పొరేట్ సెంటర్లో చేసే ఆపరేషన్ ని అతి తక్కువ ఖర్చులో విజయవంతం చేసినందుకు వల్ల కుటుంబ సభ్యులు ఆనంద వ్యక్తం చేసి డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆపరేషన్ లో హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ పోడెండ్ల సాయికుమార్ యాదవ్, డాక్టర్ లింగమూర్తి, ఎంఎస్ ఆర్తో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ వేణుగోపాల్, ఎంఎస్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సూర్యనారాయణ, జనరల్ డాక్టర్ అనిల్ కుమార్ , హాస్పిటల్ స్టాప్ షాబుద్దీన్.రాజు.నరేష్ . సాయి.మౌనిక. అవంతిక.నందిని తదితరులు పాల్గొన్నారు.