
నవతెలంగాణ – నసురుల్లాబాద్
గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుక సభలో రసాభాస నెలకొంది.. మంగళవారం బాన్సువాడ పట్టణం లోని బంజారా భవనంలో నేడు గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య రభస పెరగడంతో మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సభ నుంచి వేనుదిరిగారు. పార్టీలకు అతీతంగా సంత సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు నియోజకవర్గస్థాయి బంజారా నాయకులను వివిధ పార్టీల నాయకులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి మాజీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి భోగి బందర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసిన బంజారా మిత్రులందరికీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు. అనంతరం బోగ్ బండార్ కార్యక్రమం ముగిసిన అనంతరం జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఇరు పార్టలకు చెందిన కొందరు నేతలు వాగ్వివాడం పెట్టుకోవడంతో సభ రసభసగా సాగింది.దీనితో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభ వేదిక నుండి వెళ్లిపోయారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు కొందరు మాట్లాడుతూ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంతు సేవాలాల్ మహారాజుని బంజారా నాయకులను అవమానించారంటూ కొందరు ఆరోపించారు. అలాగే బీఆర్ఎస్ బంజారా నాయకులు మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల కన్నా బాన్సువాడ నియోజకవర్గం లో సంత సేవాలాల్ మహారాజ్ ఆలయ, మందిరాల నిర్మాణం కోసం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎంతో కృషి చేశారని బంజారాల అభివృద్ధికై ఆయన ఎంతో పాటు పడ్డారని అన్నారు. సంత్ సేవలాల్ మాహారాజు జయంతి వేడుకల్లో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు.