
మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో రేషన్ కార్డులు అందరికీ రాలేదని, కొందరికే ఎలా ఇస్తారని గురువారం జరిగిన గ్రామసభలో గ్రామస్తులు అధికారులను నిలదీశారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరి గృహాలను సర్వే చేయలేదని, అందుకే రేషన్ కార్డులు రాలేదని ఆరోపించారు. సర్వే ఏ ప్రతిపాదికన చేశారో వెల్లడించాలని పట్టుబట్టారు. ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తులు, మీసేవ కేంద్రాల ద్వారా చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా రేషన్ కార్డులు మంజూరైనట్టు వెల్లడించిన గ్రామస్తులు శాంతించలేదు. సర్వే చేసిన అధికారుల పేర్లు తెలపాలని ఎంపీడీవో బాలకిషన్ ను నిలదీశారు. గ్రామస్తులంతా ఒకరినొకరు వాగ్విధానికి దిగడంతో సభ రసాబసగా మారింది. అర్హులై ఉండి రేషన్ కార్డులు రాలేని వారు తిరిగి దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఎంపీడీవో స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ మధు, ఎంపీ ఓ.సాయిలు సంబంధిత అధికారులు స్థానికులు పాల్గొన్నారు.