
నవతెలంగాణ – అశ్వారావుపేట
రెండో రోజు గ్రామసభల్లో రసాభాస చోటుచేసుకుంది. మండలంలోని అచ్యుతాపురం, అనంతారం, ఆసుపాక, మల్లాయిగూడెం, నందిపాడు, నారావారి గూడెం, ఊట్లపల్లి, పాత రెడ్డిగూడెం, రామన్నగూడెంలో బుధవారం గ్రామసభలు నిర్వహించారు. ఆసుపాక, నందిపాడుల్లో సర్వే చేసిన గృహాలకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు పొంతనే లేదని, అలాంటపుడు సర్వే చేయడం ఎందుకు గ్రామసభలు పేరుతో పేదలను ఇబ్బంది పెట్టడం ఎందుకు అంటూ పలువురు అధికారులను నిలదీసారు. ఇంటి పేరు లేకుండా వ్యక్తులు పేరుతో లబ్ధిదారుల జాబితా ఉండటంతో అభ్యంతరం తెలిపారు. ఈ కార్యక్రమాల్లో తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్, మండల ప్రత్యేక అధికారి, పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ ప్రదీప్ కుమార్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఎంపీఈవో ప్రసాదరావు, ఐటీడీఏ డీఈ బాపనయ్య, డాక్టర్ స్వప్న, ఐబీ ఏఈ కే.ఎన్.బీ క్రిష్ణ, కార్యదర్శులు దారబోయిన వెంకటమ్మ, విజయ లక్ష్మి, మోతీలాల్, శ్రీకాంత్, అలివేలు, వెంకటేశ్వర్లు, రజినీ, సబిత లు పాల్గొన్నారు.