– ముగ్గురు అభ్యర్థుల పోటీ
– కాంగ్రెస్ కార్యకర్తలలో గందరగోళం
– కాంగ్రెస్‌లో తెరపైకి కొత్త వ్యక్తి
– బీఆర్‌ఎస్సే అధికారంలోనికి వస్తుందని ధీమా : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
– బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ నాయకుల ప్రచారం
– ప్రజల నిర్ణయం ఎటువైపో..
నవతెలంగాణ-కందుకూరు
మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పోటీ చేయనున్నారు. బీజేపీ అభ్యర్థిగా అందెల శ్రీరాములు యాదవ్ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ తమకే అధికారం దక్కుతుందని బడంగ్ పేట మేయర్ చిగురింత పాజాత నరసింహ రెడ్డి, మూడు నెలల నుంచి మహేశ్వరం నియోజకవర్గం ప్రజలకు కాంగ్రెస్ నుంచి నేనే పోటీ చేస్తానని కార్యకర్తలకు, నాయకులకు ప్రజలకు తెలిపారు. గ్రామాల్లో తనకే సీటు దక్కుతుందని ధీమాతో ప్రచారం నిర్వ హించగా, అధిష్టానం తెరపైకి కొత్తగా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా కిచెన్న లక్ష్మారెడ్డికి రెండో విడత జాబితాలో పేరు ప్రకటించడంతో చిగురింత పారిజాత నరసింహరెడ్డి అయోమయంలో పడ్డారు. ఎంతో ఆశతో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా తెరపైకి కిచెన్న గారి లక్ష్మారెడ్డి పేరు ప్రకటించడంతో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఏం చేయాలని అని మదన పడుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం తీసుకొన్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని మరికొంతమంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అంటున్నారు. మరి కొంతమంది కార్య కర్తలు నాయకులు కాంగ్రెస్ అధిష్టానం చిగురింత పారిజాత నరసింహారెడ్డికి మాట ఇచ్చి మోసం చేశారని అంటున్నారు. ముందు ముందు వేచి చూస్తే ఏంటో కాంగ్రెస్ నుంచి తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోనికి కాంగ్రెస్ పార్టే వస్తుందని నాయకులు, కార్యకర్తలు దీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రచారంలో ముందు వరుసలో బీఆర్‌ఎస్
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోనికి వస్తుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ అన్ని పార్టీల కంటే ముందే అభ్య ర్థులను ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఆయా నియోజకవర్గాలలో ప్రచారం పూర్తిగా చేశారు. మహేశ్వరం నియో జకవర్గంలో ఒక దఫా ప్రచారం అయిపోయింది. గ్రామాల్లో మండలాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాలు జరుగనున్నాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథ కాలను అమలు ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజలు తమ వైపే ఉన్నారని మూడవసారి ముచ్చటగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికా రంలోనికి వస్తుందని ధీమా వ్యక్తం చేసు ్తన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో వందలాది కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసి చూపించారు. కందుకూరు మండలానికి లా కళాశాల, మెడికల్ కళాశాల, 450 పడకల ప్రభుత్వ ఆస్పత్రి మంజూరు చేశారు. మరోసారి అధికారం లోనికి వస్తే దాసర్లపల్లి గేటు వరకు మెట్రో రైలు ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ హామీనిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోనికి వస్తే సంక్షేమ పథకాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని బీఆర్‌ఎస్ కార్యకర్తలు నాయకులు అభిమానులు అంటున్నారు. ఈ విషయాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లి ముందుకు సాగుతున్నారు. మహేశ్వరం బీజేపీ అభ్యర్థిగా ఆందెల శ్రీరాములు యాదవ్ కేటాయించడంతో ఆయన కూడా మహేశ్వరం నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గం లో ప్రముఖ వ్యక్తులను కలుస్తూ తమకు మద్దతు తెలిపారని కోరుతూ హామీ లు తీసుకుంటున్నట్టు తెలిసింది. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోనికి వస్తే బీసీ కులానికి చెందిన వారిని సీఎం చేస్తామని అమిత్ షా ప్రకటించారు. ఈయన కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజకీయం రసవత్తరంగా మారనుంది. ముందు, ముందు ఏమి సమీకరణలు జరుగుతాయో వేచీ చూడాలి మరి.