నగరంలో సందడి చేసిన సినీ తార రాశిఖన్నా

– నిజామాబాద్ నగరంలో రోబోటిక్ టెక్నాలజీతో  ఆపరేషన్లు నిర్వహిస్తున్న నోవ లైఫ్ ఆసుపత్రి సిబ్బంది
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలో ప్రముఖ సినీ తార రాశిఖన్నా శనివారం సందడి చేసింది నొవలైఫ్ ఆసుపత్రి 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తర తెలంగాణలోని మొట్టమొదటి రోబోటిక్ మోకాళ్ళ మార్పిడి చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ వైద్యులు నవీన్ మాలు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా ప్రజలతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలను కోరారు. ఎక్కడలేని విధంగా నూతన టెక్నాలజీతో మార్పిడి రోబోటిక్ టెక్నాలజీతో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే సినీతార రాశి కన్నా ప్రజలకు తెలుపుతూ ప్రస్తుత పరిస్థితులలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా వాహనాలను నడపాలని అలాగే ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా ఉండాలని కుటుంబ సభ్యులు తమపై ఆధారపడి ఉంటారని పలు సూచనలు తెలుపుతూ ఇలాంటి చికిత్సను నోవా లైఫ్ ఆసుపత్రి వారు నూతన టెక్నాలజీని నిజామాబాద్ జిల్లాకు తీసుకురావడం మంచి పరిణామం అని అన్నారు.సినీ తారను వీక్షించడానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య బృందం తో పాటు సినీతాలను చూసేందుకు వచ్చిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఉండడంతో కొద్దిసేపు రోడ్డుపై వాహనదారులకు ఇబ్బంది కలిగింది.