రష్మిక.. భిన్న పాత్రలకు కేరాఫ్‌

Rashmika.. Caraf for different rolesఅల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో రాబోతున్న ‘పుష్ప-2 ది రూల్‌’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శుక్రవారం రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా పుష్ప -2లో శ్రీవల్లిగా ఆమె పాత్ర గెటప్‌ను రివీల్‌ చేస్తూ ఓ పవర్‌ఫుల్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈనెల 8న అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల కానుంది. రష్మిక మందన్న, హీరో దీక్షిత్‌ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’.
ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌, మాస్‌ మూవీ మేకర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్‌ లవ్‌ స్టోరీతో దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ రూపొందిస్తున్న ఈ చిత్రానికి ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలు. 60 శాతం పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్‌ షూటింగ్‌లో ఉంది.