హైదరాబాద్ : గ్లోబల్ లైటింగ్ ఉత్పత్తుల కంపెనీ సిగ్నిఫై తమ నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటి రష్మిక మందన్నను నియమించుకున్నట్టు ప్రకటించింది. యువ వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఈ భాగస్వామ్యం దోహదం చేయనుందని పేర్కొంది. అత్యుత్తమ ఆవిష్కరణలను తీసుకు రావడం పట్ల తాము విశ్వాసాన్ని కలిగి ఉన్నామని సిగ్నిఫై గ్రేటర్ ఇండియా సీఈఓ సుమిత్ జోషి పేర్కొన్నారు.