నవతెలంగాణ – రాయపర్తి
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సోమవారం రాయపర్తి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై చూపెడుతున్న మొండి వైఖరిని ప్రశ్నిస్తూ చేపట్టిన రాస్తారోకోలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ రహదారిపై ఇరువైపులా వందల వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే విచ్చేసిన స్థానిక ఎస్ఐ శ్రావణ్ కుమార్ వారితో మాట్లాడి రాస్తారోకోను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హామ్య నాయక్, మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, మండల నాయకులు ఈఎంసి వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, పాలకుర్తి ఆలయ చైర్మన్ కృష్ణమాచార్యులు, మండల నాయకులు గోవర్ధన్ రెడ్డి, ముద్రబోయిన వెంకటేశ్వర్లు, ఉలేంగుల నర్సయ్య, యాదగిరి, గబ్బేట బాబు, బొమ్మెర కళ్యాణ్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, అఫ్రోజ్ ఖాన్, పెండ్లి మహేందర్ రెడ్డి, వల్లపు కుమార్, చిర్ర మల్లయ్య, మచ్చ నిల్లయ్య, మచ్చ రమేష్, పిరని ప్రవీణ్, చెడుపాక వెంకటేష్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.