- టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచి మేనేజర్ సూర రామకృష్ణారెడ్డి
- టాటా ఏఐఏ ఆధ్వర్యంలో ఘనంగా రతన్ టాటా జయంతి
- ప్రభుత్వ ఆస్పత్రి, గోదాకాంతా లక్ష్మి, అమ్మ ఫౌండేషన్, వీర బ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమంలో అన్నదానం
- దేశరాజ్‌పల్లిలోని వందన అనాథాశ్రమంలో పిల్లలకు 60 దుప్పట్లు, పండ్లు పంపిణీ
నవతెలంగాణ – కరీంనగర్
భారత పారిశ్రామిక రంగానికి ఆదర్శప్రాయ నేత త్వం అందించిన రతన్ టాటా జయంతి సందర్భంగా ఆయనకు మనం అర్పించగలిగే ఉత్తమ నివాళి టాటా సంస్థలకు మద్దతు అందించడమేనని, ఆయన విలువలు, దార్శనికత, మానవతా విలువలు అందరికీ స్ఫూర్తిదాయకమని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచి మేనేజర్ సూర రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం రతన్ టాటా జయంతిని పురస్కరించుకుని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కరీంనగర్ బ్రాంచి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు, గోదాకాంతా లక్ష్మి, అమ్మ ఫౌండేషన్, వీర బ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం దేశరాజ్‌పల్లిలోని వందన అనాథాశ్రమంలో 60మంది పిల్లలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచి మేనేజర్ సూర రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రతన్ టాటా ఆశయాలను కొనసాగిస్తూ వ్యాపారంలో నిజాయితీ, సేవా దృక్పథంలో ముందుకు సాగుతామన్నారు. టాటా సంస్థలు ఎప్పటికీ దాతృత్వం కలిగిన సేవలు దేశానికి అందిస్తాయని అందులో భాగంగానే రతన్ టాటా జయంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. మున్ముందు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థిక భద్రత ఉండాలనే రతన్ టాటా గారి ఆలోచన నుంచి ఉద్భవించిన టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా మారు మూల గ్రామాలకు సైతం సేవలను విస్తరిస్తామని, ప్రతి ఒక్కరికి బీమాతో ధీమా కల్పిస్తామన్నారు.
ప్రతి పౌరుడికీ ఆర్థిక భద్రతే లక్ష్యం..
ఈ సందర్భంగా ఏజెన్సీ పాట్నర్ మల్లారపు పుష్ప మాట్లాడుతూ.. రతన్ టాటా కేవలం ఒక వ్యాపారవేత్తే కాదని ప్రతి భారతీయుడి జీవితానికి ఆర్థిక భద్రతను అందించాలన్న మహోన్నత ఆశయానికి రూపకర్త అన్నారు. టాటా ఏఐఏ లైఫ్ ఎన్సూరెన్స్ ద్వారా ఆయన కలను కొనసాగిస్తూ దేశంలోని కోట్లాది కుటుంబాల భవిష్యత్తును భద్రపరచడంలో మేము గర్వంగా ముందంజలో ఉన్నామని తెలిపారు. ప్రతి పౌరుడు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని సూచించారు. తక్కువ ప్రీమియంతో అధిక రక్షణ(రూ.50లక్షల నుంచి రూ.100కోట్ల వరకు) కల్పించే టర్మ్ పాలసీను తీసుకోవాలని, దీర్ఘకాలిక పెట్టుబడులతో మంచి రాబడులు ఇచ్చే ముచ్యువల్ ఫండ్ ఎంపిక తెలివైన నిర్ణయం అన్నారు. టర్మ్ + వెల్త్ బెన్‌ఫిట్స్‌తో ఒక కుటుంబం యొక్క ఆర్థిక అవసరాలైన భారీ జీవిత భద్రత మరియు ముచ్యువల్ ఫండ్ కలిపి తీసుకోవడం భారీ ఆదాయం సమకూరే గొప్ప పాలసీ టాటా ఏఐఏ వారి పరమ్ రక్షక్ లైఫ్ ప్రో పాలసీ ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిందన్నారు. మంచి టర్మ్ ప్లాన్ కోసం 9491679493 నెంబర్ ద్వారా సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాట్నర్ కెజి నరేందర్‌రావు, ట్రైనర్ వెంకటేష్ వర్మ, అసిస్టెంట్ మేనేజర్లు వీరస్వామి, ఆదర్శకుమార్, చంద్రశేఖర్, ఏజెన్సీ పాట్నర్స్ శ్రీకాంత్, గుడెల్లి రాజు, మల్లారపు పుష్ప, సిబ్బంది పాల్గొంది.