
నవతెలంగాణ-కంటేశ్వర్
మున్సిపల్ శానిటేషన్ అధికారుల వేధింపుల వల్ల శానిటేషన్ కార్మికుడు రవి ఆత్మహత్యకు చేసుకోవడంతో రవి కుటుంబ సభ్యులకు పెద్ద దిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ శానిటేషన్ కార్మికుడు రవి విషయంలో బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ బి ఎల్ టి యు ఎంహెచ్ఒ ని కలిసి పని ఒత్తిడి తగ్గించడానికి, సర్కిల్ 5 నుండి రిలీవ్ చేసి సర్కిల్ 4 బి కి బదిలీ చేయాలని కోరుతూ యూనియన్ తరుపున వినతిపత్రం అందజేసినా మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ సరిగా స్పందించలేదని దండి వెంకట్ ఆరోపించారు. మరింత పని ఒత్తిడి పెంచుతూ స్పెషల్ టీంకు బదిలీ చేయడంతొ రవి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారని చెప్పారు. కార్పొరేషన్ మేజర్ వైఖరికి నిరసనగా 19న చలో కలెక్టరేట్ రవి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా అనంతరంకమిషనర్ లేకపోవడంతో మేనేజర్ బయటకు వచ్చి వినతిపత్రం తీసుకోవాలని కోరగా ఆయన బయటకు రావడానికి నిరాకరించారు. దాంతో బి ఎల్ టి యు యూనియన్ తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ వినతిపత్రం ఇన్ వార్డ్ లో ఇచ్చి మేనేజర్ చర్యలకు నిరసనగా నేడు ఛలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బహుజన మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత, బిఎల్ టియు జిల్లా అద్యక్షులు కె.మధు, బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ బి ఎల్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, ఉపాధ్యక్షులు యాదయ్య, డ్రైవర్స్ యూనియన్ నాయకులు మోహన్ గౌడ్, నవీన్, రమేష్ యల్లయ్య, రాహుల్, మురళి, బహుజన శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ ఆశాబాయ, నాయకులు లలిత రేణుకా, నీలా తదితరులతోపాటు వాటర్ సప్లయ్ గార్డెన్స్ స్ట్రీట్ లైట్స్, డ్రైవర్స్ పాల్గొన్నారు.