మద్నూర్ లో ఘనంగా రథోత్సవాలు..

– పెద్ద ఎత్తున కుస్తీ పోటీలు, అన్నదాన కార్యక్రమం
– మహా అన్నదాత ఎంపీ బిబి పాటిల్,
– రథోత్సవానికి రంగుల దాత జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు,
– కుస్తీ పోటీల దాత మాజీ ఎమ్మెల్యే హనుమంతు సిండే ,

– డీజీ దాత బీజేపీ కృష్ణ పటేల్, ఉత్సవాల దాతలకు ఆలయ కమిటీ ఘన సన్మానాలు,

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని రథం గల్లీలో గల శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి రథోత్సవాలు గత రెండు రోజులుగా అంగరంగ వైభోగంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు శుక్రవారం మహా అన్నదాన దాత ఎంపీ బీబీ పాటిల్, రథోత్సవాలకు రంగుల దాత జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు, కుస్తీ పోటీల దాత జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిండే, డీజీ ధాత బిజెపి కృష్ణ పటేల్, మొదటి రోజు అన్నదాత సంతోష్ మేస్త్రి, ఉత్సవాల కరపత్రాల దాత బొగ్గుల సంజు, ఈ విధంగా ఉత్సవాలు విజయవంతం కావడానికి పెద్ద ఎత్తున అన్నదాతలు ముందుకు రావడం గత రెండు రోజులుగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల కోసం ముందుకు వచ్చిన దాతలు అందరికీ ఆలయ కమిటీ చైర్మన్ ఆలయ కమిటీ సభ్యులు శాలువలతో ఘనంగా సత్కరించారు. లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో రెండు రోజులు దినం నుండి సాయంత్రం వరకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. గ్రామంలో రత్నాన్ని ఊరేగించారు. పెద్ద ఎత్తున కుస్తీ పోటీలు జరిపారు రథోత్సవ శోభయాత్రకు వేలాదిగా జనాలు భక్తులు తరలివచ్చారు. ఘనంగా జరిపిన ఉత్సవాలను చూసి గ్రామస్తులు ఆలయ కమిటీ నిర్వాహకులకు అభినందించారు. గ్రామ పెద్దలు యువకులు సహకరించడం రథోత్సవాలు విజయవంతం అయ్యాయి.