– జిల్లా కలెక్టర్ హనుమంతరావు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డు అందజేయడం జరుగుతుందని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ హనుమంత రావు ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. రేషన్ కార్డు జారీకి సంబంధించి అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు కార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి పథకాలు అందజేయడం జరుగుతుందని రాలేదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. గ్రామ సభల్లో, వార్డుల్లో, ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకున్న వాటిని పరిశీలించి అర్హులకు రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. కుటుంబంలో విభజన అయినవారు కొత్త కార్డు కోసం చేసుకున్న దరఖాస్తును కూడా పరిశీలిస్తామన్నారు. గతంలో పెండింగ్ ఉన్న దరఖాస్తులను కూడా పరిశీలిస్తామని అన్నారు. ఇదివరకు ఎప్పుడూ దరఖాస్తుసమర్పించకపోయినా నెల 21 నుండి 24 వరకు నిర్వహించే గ్రామ సభల్లో కూడా దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందన్నారు. దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.