– బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు ప్రజలు నమ్మొద్దు..
– బర్రె జహంగీర్ మున్సిపల్ మాజీ చైర్మన్ (బిజెఆర్ )..
నవతెలంగాణ – భువనగిరి
అర్హులకు రేషన్ కార్డుల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ తెలిపారు. సోమవారం ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు దరఖాస్తుల సర్వేలో భాగంగా షియా కాలనీలో సర్వే ను, వివిధ వార్డులలో జరుగుతున్న సర్వేను ప్రజలకు వివరించారు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ఒక ఇల్లు, ఇంటి రుణం, రేషన్ కార్డులు ఇవ్వలేని నాటి ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు ఈ నెల నుండి అర్హులైన వారికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా ఇవ్వడం జరుగుతుందన్నారు. జాబితాలో ఏదైనా సాంకేతిక ఇబ్బందులతో రానటువంటి వారు ఎవరు కూడా అధైర్య పడకుండా సమయానికి దరఖాస్తు చేసుకొని వారు రేపటినుండి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈనెల 21 నుంచి 24 వరకు జరిగే వార్డు సమావేశాల్లో కొత్త వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందించనున్నట్టుగా చెప్పారు. ఆయన వెంట ఉడత రమేష్, ఎండి ఇఫ్తాకర్, బోయిని ధనలక్ష్మి, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.