రేషన్ డీలర్లు సమయపాలన పాటించాలి 

నవతెలంగాణ  – చండూరు
రేషన్ డీలర్లు సమయ పాలన  పాటించి ప్రతి నెల లబ్ధిదారులకు సక్రమంగా సబ్సిడీ వస్తువులను అందించాలని మాజీ సర్పంచ్ మా రెడ్డి శ్రీదేవి నర్సిరెడ్డి  అన్నారు. సోమవారం మండలంలోని  శిర్దాపల్లి గ్రామంలో నూతన రేషన్ షాపును ఆమె ప్రారంభించి మాట్లాడారు.   కాంగ్రెస్ ప్రభుత్వం అందించే సబ్సిడీ  వస్తువులను గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పోలా వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు  మారెడ్డి నర్సిరెడ్డి,  డీలర్  సాయం  రేణుక సత్యనారాయణ, మాజీ సర్పంచ్ పల్లె లింగయ్య, గంట మల్లయ్య, అంజిరెడ్డి, రేషన్  డీలర్లు తదితరులు పాల్గొన్నారు.