20 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత..

నవతెలంగాణ – తిరుమలగిరి
మాడొత్ ఘన్య తండ్రి భీము పుట్టగూడెం గ్రామం, యదాద్రి భువనగిరి జిల్లా కు చెందిన వ్యక్తి తన అశోక్ లేలాండ్ ట్రాలి ఆటోలో ప్రభుత్వం పెద ప్రజలకు పంపిణీ చేసే బియ్యం సుమారు 40 బ్యాగులు, 20 క్వింటల వరకు అక్రమంగా రవాణా చేయుచుండగా, నమ్మదగిన సమాచారం మేరకు తిరుమలగిరి మండలంలోని కె ఆర్ కె తండ ఎక్స్ రోడ్డు వద్ద పట్టుబడి చేసి, కేసు నమోదు చేసి, తదుపరి విచారణ చేపట్టినామని తిరుమలగిరి ఎస్‌ఐ కే. సత్యానారాయణ తెలిపారు.