నవతెలంగాణ-మిరు దొడ్డి : ఆటోలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మిరుదొడ్డి పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం మిరుదొడ్డి మండల కేంద్రంలో ఆటోలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ఆటోను తనిఖీ చేసి రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం జరిగిందని ఎస్సై నరేష్ తెలిపారు. ఆటోలో 8 క్వింటాల 20 కేజీల బియ్యం దొరకడంతోపాటు ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కొంతమంది బి అని తెలుస్తున్న క్రమంలో నమోదైన సమాచారంతో పోలీసులు అక్రమంగా బియ్యం తరలిస్తున్న ఆటోను అదుపులో తీసుకున్నారు అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. రేషన్ బియ్యాన్ని ఎవరైనా అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇట్టి విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.