రేషన్‌ బియ్యం పట్టివేత

నవతెలంగాణ-కొందుర్గు
కొందుర్గు మండల పరిధిలోని చిన్న ఎల్కిచర్ల గ్రామం పుల్లప్పగూడలో ఓ వ్యక్తి అక్రమంగా రేషన్‌ బియ్యం సే కరించి ఇంట్లో నిల్వ ఉంచాడు. పక్క సమాచారం అందు కున్న పోలీసులు రేషన్‌ బియ్యం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పుల్లప్పగూడకు చెందిన రాజా శివకుమార్‌ రేషన్‌ బియ్యం సేకరించి బయట అమ్ముకోవ డానికి పెద్ద మొత్తంలో నిల్వ ఉంచాడు. ఈ విషయం పోలీసులకు తెలిపింది. దాంతో వారు రాజా శివకుమార్‌ ఇంట్లో తనిఖీ చేయగా 7 క్వింటాళ్ల బియ్యన్ని పట్టుకున్నా రు. ఈ విషయం పైన రాజా శివకుమార్‌ విచారించగా తెల్ల రేషన్‌ కార్డుదారుల వద్ద కిలో రూ.10 చొప్పున కొని లేబర్‌ పని చేసే వాళ్లకు ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్టు ఒప్పుకున్నాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపారు.