– పుదుచ్చేరిలో సీపీఐ(ఎం) ఆందోళన
పుదుచ్చేరి : రేషన్ షాపులను పున:ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ పుదుచ్చేరిలో ఒక పగలు, ఒక రాత్రి సీపీఐ(ఎం) ఆందోళన నిర్వహించింది. ఇక్కడి కొక్కు పార్క్ వద్ద ఉన్న పౌర సరఫరాల కార్యాలయం ఎదురుగా జరిగిన నిరసనలో సీపీఐ(ఎం) కార్యదర్శి ఆర్ రాజంగం ప్రసంగించారు. రేషన్ షాపులను పున:ప్రారంభించాలని రెండున్నర ఏండ్లుగా తమ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు. ‘ప్రజలంతా నగదుకు బదులుగా బియ్యం కోరుకుంటున్నారు. కాబట్టి ఒక పగలు, ఒక రాత్రి ఆందోళన ద్వారా ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది’ అని తెలిపారు. 2021 ఎన్నికల ప్రచారంలో రేషన్ షాపులను పున్ణప్రారంభిస్తామని అఖిల భారత ఎన్‌ఆర్ కాంగ్రెస్ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్ రంగసామి ప్రజలకు హామీ ఇచ్చినా, ఆయన నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. కిరణ్‌బేడీ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న సమయంలో ఉచిత బియ్యం పంపిణీకి బదులుగా లబ్ధిదారుల ఖాతాలోకి నగదును బదిలీ చేయాలని నిర్ణయించడంతో ఇక్కడి రేషన్‌పాపులను మూసివేశారు.