
తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రజా ప్రతినిధుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వడ్డెకొత్తపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యులు దంతాలపల్లి రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడి శంకర్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మాజీ ప్రజాప్రతినిధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.