
జిల్లా కేంద్రం లోని వినాయక నగర్ 100ఫీట్స్ రోడ్డు లో గల ఏకాదంత గణేష్ మండలి లో మంగళవారం వినాయక నిమజ్జన సమయంలో లడ్డు వేలం పాట నిర్వహించడం జరిగింది. ఈ లడ్డు వేలం పాటలో రవిగౌడ్ రూ.45000/- కు లడ్డు ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ.. వినాయకుని ఆశీస్సులతో లడ్డును వేలంపాటలో దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు.