కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా కనుక రవి

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
జక్రాన్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు గా కనుక రవి నియామకమైనట్లు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నిర్వహించిన పార్లమెంటరీ సన్నాహ సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా జక్రాన్ పల్లి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా కనుక రవి కీ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి నియామక పత్రం అందజేశారు . రవి మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి నాకు బాధ్యత పెంచిన డాక్టర్ భూపతి రెడ్డి కి కృతజ్ఞతలు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో జక్రాన్ పల్లి మండల ఎస్సీ లను అందరినీ కలుపుక పోయి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ  సెల్ జిల్లా అదక్షుడు ఈరంటి లింగం, జక్రన్ పల్లి మండల ఉపాధ్యక్షులు ఉత్కం శ్రీనివాస్ గౌడ్, జక్రన్ పల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సొప్పరి వినోద్, రూరల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఊమ్మజి నరేష్, మాజీ సర్పంచ్ మునిపల్లి చిన్న సాయి రెడ్డి, మండల ఉపాధ్యక్షులు యూత్ కాంగ్రెస్ కిషోర్ తొర్లికొండ గ్రామ ప్రధాన కార్యదర్శి వినోద్, మాల మహానాడు జిల్లా యూత్ అధ్యక్షులు కిరణ్ అనుపాల్ గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీ మరియు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.