రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో చేస్తున్న ప్రాజెక్ట్‌కు ‘మిస్టర్ బచ్చన్’ అనే పవర్ టైటిల్‌ని ఖరారు చేశారు. టైటిల్ పోస్టర్ రవితేజ అమితాబ్ బచ్చన్ ఐకానిక్ పోజ్‌ను అనుకరిస్తున్నట్లు అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పనోరమా స్టూడియోస్, టి-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. ఆదివారం చిత్రబృందం, అతిథుల సమక్షంలో ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయింది. హీరో రవితేజ, నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల, రఘు రామకష్ణ స్క్రిప్ట్‌ను దర్శకుడు హరీష్ శంకర్‌కి అందజేశారు. రవితేజపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు కుమార్ మంగత్ పాఠక్ క్లాప్ కొట్టగా, కె రఘు రామకష్ణ, టిజి భరత్ కలిసి కెమెరా స్విచాన్ చేసారు. ముహూర్తం షాట్‌కు వివి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ముహూర్తం షాట్ కోసం ”మిస్టర్ బచ్చన్… నామ్ తో సునా హౌగా!” డైలాగ్‌ని చెప్పారు రవితేజ. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఎడిటర్‌గా ఉజ్వల్ కులకర్ణి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.