రవితేజ ‘మాస్‌ జాతర’

Ravi Teja's 'Mass Fair'రవితేజ హీరోగా నటిస్తున్న తన 75వ చిత్రం ‘మాస్‌ జాతర’. భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈచిత్ర గ్లింప్స్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మునుపటి అసలు సిసలైన మాస్‌ మహారాజా రవితేజను గుర్తు చేసేలా ఈ గ్లింప్స్‌ ఉంది. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనం లాంటి మాస్‌ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోందని గ్లింప్స్‌ను చెప్పకనే చెప్పిందని చిత్రయూనిట్‌ తెలిపింది. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. రవితేజ-శ్రీలీల జోడి గతంలో ‘ధమాకా’తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. వీరి కలయికలో ‘మాస్‌ జాతర’ రూపంలో మరో బ్లాక్‌ బస్టర్‌ అందుకోవడం ఖాయమని మేకర్స్‌ నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రానికి రచన: భాను బోగవరపు, నందు సవిరిగాన, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: విధు అయ్యన్న, కళా దర్శకత్వం: శ్రీ నాగేంద్ర తంగాల, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఫణి కె.వర్మ.