నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా రవికుమార్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ 20 నెలల పాటు పనిచేసిన సురేష్ బాబు బదిలీ కాగా ,వీరి స్థానంలో సిద్దిపేట రెండవ టౌన్ నుండి వచ్చారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో పాటు, శాంతి భద్రతల పర్యవేక్షణకు, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.