రాతిగోడల రావిమొక్క

అక్కడ ప్రశ్నలు మొలకెత్తవు..
అందరూ అపరిచిత ముఖతొడుగుల
ధరించి ఉంటారు…

ముళ్ళపొదలు నిగూఢ రహస్యపు
గాజుకళ్ళను పొదువుకున్నవి…

అనుమతులు అవసరం…
గుండెల నిండా ఊపిరి నింపుకోవాలన్నా…

అక్కడ స్వప్నాలు నిషిద్ధం…
కళ్ళు కలలని దాచేసుకోవాలి.
ఎక్కడా రెప్పలు తీక్షణమవ్వకూడదుు
భకుటి ముడిపడకూడదు

ఎవరూ ఎక్కడా భారాన్ని దింపుకోకూడదు…

గారపట్టిన దారులు,
బరువెక్కిన దశ్యాలు….
పాదం కింద నలిగిన అగ్నిపూలు…
అటూ ఇటూ గొంతును బిగించిన
బోన్‌ సారు చెట్లు..

ప్రశ్న ఎప్పుడూ నీకు చేదుపాటే…
బిగించిపట్టిన గాలిరెక్కలు,
నిలువునా కరిగిపోతున్న గుండెకోతలు…

అయినాసరే…
అక్కడ ప్రశ్నలు నిషిద్ధం…

కొన్ని తెల్లబోయిన గాయపడిన హదయాలు…
జీవనాడులు కదలలేని బిగింపు…
ఇప్పుడిప్పుడే
గుప్పిట గట్టిబడుతున్న శబ్దం…

నిలువెత్తు గోడలలోనూ
విత్తనం మొలకెత్తుతున్న దశ్యం…
ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది…

– సీహెచ్‌. ఉషారాణి, 9441228142