ఉప్పునుంతల మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో పాల్గొని రైతులకు రుణమాఫీ కానీ సమస్యల పట్ల బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కొత్త రవీందర్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని మార్చుకోవాలని ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదట రైతు రుణమాఫీ రెండు లక్షలు చేస్తానని రాష్ట్ర ప్రజలని నమ్మించి మోసం చేస్తూ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచిన గాని ఇప్పటికి రెండు లక్షల రుణమాఫీ రాష్ట్రంలో సగానికి సగం రైతులకు రుణమాఫీ చేయలేదని రేషన్ కార్డు, ఆధార్ కార్డు పేరుతో వ్యవసాయం చేసుకునే రైతులను ప్రతిరోజు బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటూ కాలయాపన చేస్తూ చాలామంది రైతులలో ఆందోళన కలిగించే విధంగా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రైతుబంధుకు రామ్ రామ్, దళిత బంధకు జై భీమ్ పెంచిన పింఛన్ల జాడే లేదు, కల్యాణ లక్ష్మి లక్ష రూపాయలు తులం బంగారం ఊసే లేదు, షాదీ ముబారక్, ప్రతి మహిళకు 2500 రూపాయలు మర్చిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి పూర్తిగా ప్రజలను నమ్మించి మోసం చేస్తూ అధికారంలోకి వచ్చి ఇప్పుడు రైతులని అటు రాష్ట్ర ప్రజలని ముప్పు తిప్పలు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై 9 నెలకే విరక్తి చెంది రాష్ట్ర ప్రజలందరూ బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ పాలనే కోరుకుంటున్నరాన్నారు. ఈ కార్యక్రమంలో మండల పాల సేతలికరణ కేంద్రం చైర్మన్ కట్ట గోపాల్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు మేడమోని శ్రీను, కొట్టే తిరుపతయ్య యాదవ్, సంతోష్ రెడ్డి, చిన్న జంగయ్య,సుధాకర్, బాలస్వామి, నవీన్, వెంకటయ్య, మహేష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.