అనుమతుల పేరుతో అక్రమ ఇసుక డంపింగ్ : కొత్త రవీందర్ రావు

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం పరిధిలో మొల్గర గ్రామ శివారు దుందిబి వాగు నుండి ఇసుక ప్రభుత్వ అనుమతుల పేరు మీద కలెక్టర్ గారితో ప్రోసిడింగ్ తో ఇసుక హిటాచి ద్వారాలోడు చేస్తు టిప్పర్ల ద్వారా తరలించడం జరుగుతుంది ప్రతిరోజు టిప్పర్ ద్వారా తీసుకుపోతున్న ఇసుక గ్రామ శివారులో డంపు చేసి ట్రాక్టర్ల ద్వారా  విక్రయించడం జరుగుతుంది గతంలో ప్రభుత్వము అభివృద్ధి పనుల కొరకు ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తే ఎమ్మెల్యే ఇసుక వ్యాపారం చేస్తుండని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పైన ప్రెస్ మీట్ లో ఎన్నోసార్లు కాంగ్రెస్ నాయకులు విమర్శించడం జరిగింది అప్పుడు విమర్శించిన అందులోని కొంత మంది నాయకులు అక్కడ ఇసుక డంపు మనమే చేపిస్తున్నాం వదిలేయండి అని చెప్పి అక్కడ ఆపిన ప్రజలను ఆదేశించడం జరిగింది  మంగళవారం డంపింగ్ చేపిస్తూ రాత్రిపూట ట్రాక్టర్లకు ఎత్తిచడం జరుగుతుంది ప్రతిరోజు ఎన్ని కుబీకు మీటర్ల ఇసుక తీయాల్నో అన్ని తీయకుండా ఐదు టిప్పర్లు ఇసుక తరలించడానికి అనుమతి ఉంటే రోజు 8 నుండి 10 దగ్గర హిటాచి ద్వారా లోడు చేసి తరలించడం జరుగుతుంది మంగళవారం మధ్యాహ్నం ఉప్పునుంతల శివారులో టిప్పర్ల ద్వారా ఒక కలములో ఇసుక డంపు చేయడం జరిగింది మధ్యలో డప్పు చేసి అమ్ముతున్నారు  అని  ఈ విషయం గురించి రెండు రోజుల క్రితం ఎమ్మార్వో దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది  అధికారులు శ్రద్ధ వహించి అనుమతుల పేరుమీద అక్రమ ఇసుక తరలించకుండా చర్య తీసుకోవాలని కోరుచున్నాము చర్య తీసుకొనకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది  ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు ఇసుక తరలిస్తే ఇందులో ఎవరికి ఏమాత్రం ఇబ్బంది లేదు అభివృద్ధి పనులు జరగాలంటే ఇసుక అవసరం కనుక ఇసుక డంపు చేస్తే చర్య తీసుకునే విధంగా చూడాలని ఒక ప్రకటనలో కోరారు.