ఈరోజు జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల అధ్యక్షుడు కొత్త రవీందర్రావు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచ్చేస్తున్నారని తెలిపారు. కావున మండలం లోని అన్ని గ్రామాల ముఖ్య నాయకులు తెలంగాణా ఉద్యమకారులు, కళాకారులు, మహిళలు, యూత్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.