
కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షుడిగా ఈదులకంటి రవీందర్ రెడ్డిని ఎన్నుకున్నట్లు పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన రవీందర్ రెడ్డి మాట్లాడుతూ… తమపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తా అన్నారు. కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి వంటిదని బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందని అలాంటి పార్టీకి మండల బాధ్యుడిగా నిలిచే అవకాశం కల్పించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గం ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు పనిచేస్తానని తెలియజేశారు.