
డెంగ్యూ పై అవగాహన కల్పించడం వల్ల పెద్ద నష్టాన్ని అరికట్టవచ్చని మండల వైద్యాధికారి రవీందర్ అన్నారు. నేడు జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని జక్రాన్‌పల్లి పిహెచ్‌సిలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి రవీందర్ మాట్లాడుతూ.. డెంగ్యూ అనేది ఒక అంటూ వ్యాధి, త్వరగా వ్యాపిస్తుందని, త్వరగా మన శరీరంలోని అన్ని అవయవాలను ప్రభావితం చేస్తుందని అన్నారు. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, డెంగ్యూ వ్యాధి అవగాహన తో డెంగ్యూ నివారించవచ్చని తెలిపారు. అనంతరం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, ఏఎన్‌ఎం, సూపర్‌వైజర్ మరియు మెడికల్ ఆఫీసర్ పాల్గొన్నారు.