పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా సచిన్ ను ప్రకటించాలి : రవీందర్

నవతెలంగాణ – మహాముత్తారం 
పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గోమాస సచిన్ ను ప్రకటించాలని, నేతకాని మండల యూత్ అధ్యక్షులు గోగు రవీందర్ అన్నారు. శుక్రవారం నవతెలంగాణతో మాట్లాడారు..తెలంగాణ మలి దశ ఉద్యమం లో తనవంతు పాత్ర పోషించి ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లా ల పరిధిలో యూనివర్సిటీ విద్యార్థులను , యువత ను ఏకం చేసి రాష్ట్ర సాధనలో తనవంతు పాత్ర పోషించిన యువ నాయకులు, విద్య వేత్త, సామాజిక ఉద్యమ కారుడు, అంబేద్కరిస్ట్, పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ యువ నాయకులు  గోమాసే సచిన్. అని అన్నారు.నేటి చదువుకున్న యువత  యువ నాయకత్వాన్ని కోరుకుంటుందని,చదువుకున్న విద్య వంతుల తోనే ఈ మార్పు సాధ్యంఅని,భావితరాలకు బాటలు వేసే యువ నాయకత్వం ఈ దేశానికి చాలా అవసరమని అన్నారు. గోమాసే సచిన్  గతంలో పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధి గురించి సూచించిన నూతన ఆలోచన విధానంతో పాటు కొన్ని వేల మంది చదువుకున్న యువత ను ఆలోచింప చేసిందని,అతను కరోనా టైమ్ లో జనాలకు నిస్వార్థం గా చేసిన సేవలు యువతను ఎంత గానో ఆలోచింప చేసిందని అన్నారు.ఆయన లాంటి నాయకులు ఈ సమాజానికి చాలా అవసరమని,గోమాసే సచిన్ లాంటి వ్యక్తి ఈ సమాజానికి  యువతకి ఆదర్శంఅని అన్నారు.కాంగ్రెస్ అధిష్టానం సచిన్ కి  పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కేటాయించి, ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న  కొన్ని లక్షలు మంది చదువుకున్న యువత యొక్క అకాంక్ష నెరవేర్చాలని కోరారు.