
చౌటుప్పల్ మండలంలో నిర్వహిస్తున్న గ్రామసభల తీరును మండల ప్రత్యేక అధికారి రవీందర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ సభలు నిర్వహించాలని ఆయా పంచాయతీ ప్రత్యేక అధికారులకు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పథకాల దరఖాస్తు ఫారాలు ప్రతి ఒక్క గ్రామ సభలో ఉంచాలని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒకరు గ్రామసభలలో సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డిఓ శేఖర్ రెడ్డి ఎంపీడీవో సందీప్ కుమార్ తహసిల్దార్ హరికృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎల్లగిరి ప్రైమరీ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మండల ప్రత్యేక అధికారి రవీందర్ పరిశీలించారు ఆయన వెంట మండల పంచాయతీ అధికారి అంజిరెడ్డి పాల్గొన్నారు.