
నవతెలంగాణ హైదరాబాద్: భారతీయ సంప్రదాయాలకు చిహ్నంగా నిలిచిన రా మ్యాంగో ‘గార్లాండ్ – ఉత్సవ 2024’ హైదరాబాదులో ప్రారంభమైంది. ఈ ఉత్సవంలో పూలహారాలు ప్రధాన చిహ్నంగా నిలుస్తాయి. పూలతోరణాలు, మాలలు, మౌర్యుడి విగ్రహాలలో చూపిన రూపాల నుంచి ప్రేరణ పొందాయి. భారతీయ సంప్రదాయాలను ఆధునీకరించి చూపిస్తుంది. రాజస్తాన్ కంహయ్యా దంగల్ వంటి ప్రదర్శనలు వ్యక్తిగత అభిరుచి, సంప్రదాయాన్ని మిళితం చేస్తుంది. బ్రోకేడ్ ఎంబ్రాయిడరీ, కాంట్రాస్ట్ కలర్ అప్లిక్వే వంటి ప్రత్యేకతలు లెహెంగాలు, చీరలు, కుర్తాల్లో హైలైట్ గా చెప్పవచ్చు. గుల్కంద్ రాణి, పద్మ పింక్, మొగ్రా వైట్, పచ్చ మామిడి రంగులు కలవు. ఈ సేకరణ సాధారణంగా ఢిల్లీలో జరిగే వివాహం చుట్టూ తిరుగుతుంది. సంప్రదాయాల మిళితమై వ్యక్తిగత సాంస్కృతిక అర్థాలను ప్రతిబింబిస్తుంది. సంప్రదాయ విలువలు, ఆధునికతను కలిపి వేడుకలలో ప్రేమ, సాంస్కృతిక అర్థాలను చూపిస్తుంది. భారతీయ సంప్రదాయాలను ఆధునిక దుస్తుల్లో మిళితం చేస్తూ.. దుస్తులో ఒక కొత్త సాంస్కృతిక కథని చెప్పడం ప్రధాన లక్ష్యం. రా మ్యాంగో స్టోర్ బంజారా హిల్స్ లో కలదు.