టమాటా ధరలు ఆందోళనకరమే : ఆర్బీఐ

న్యూఢిల్లీ : దేశంలో విపరీతంగా పెరుగుతోన్న టమాటా ధరలు ఆందోళన కలిగిస్తున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తన మాస బులిటెన్‌లో పేర్కొంది. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతోన్న టమాటా ధరల వల్ల ద్రవ్యోల్బణం ఎగిసిపడొచ్చని పేర్కొంది. టమాటా ధరల పెరుగుదల నుండి ఇతర వస్తువుల ధరలు హెచ్చు కావడంతో ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం సవాల్‌గా మారొచ్చని పేర్కొంది. సరఫరా చెయిన్‌లను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందుని సూచించింది. జూన్‌లో కిలో టమాటా రూ.40గా పలకగా.. జులై తొలి వారం నుంచి రూ.100 పైకి ఎగిసి.. కొన్ని ప్రాంతాల్లో రూ.200 చేరిన ఘటనలు ఉన్నాయి.