చెరువులను పరిశీలించిన ఆర్డీవో

నవతెలంగాణ –  భీంగల్
పట్టణ కేంద్రంలోని  రాథం చెరువు, ధర్మ రాయుడి కుంట, బాబా పూర్  గ్రామానికి ఆనుకొని ఉన్న కుంటను  ఆర్మూర్ ఆర్డీవో వినోద్ కుమార్ బుధవారం పరిశీలించారు. ఇటీవల చేపట్టిన సర్వే నివేదికను  పరిశీలించిన ఆర్డీవో బుధవారం ప్రత్యక్షంగా చెరువులను పరిశీలించి పలు  విషయాలను తహసీల్దార్ వెంకటరమణ ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో ఈ సందర్భంగా తెలియజేశారు.  ఆర్డీవో వెంట తహసీల్దార్ వెంకటరమణ, ఆర్ఐ ధనుంజయ్, సర్వేయర్ ప్రసాద్ మరియు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.