తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆర్డీఓ మధు

– స్వాగతం పలికిన తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్

నవతెలంగాణ – అశ్వారావుపేట
పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో మెట్ పల్లి నుండి బదిలీ పై ఆర్డీఓ డి.మధు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారిగా అశ్వారావుపేట తహశీల్దార్ కార్యాలయాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ పుష్పగుచ్ఛం అందజేసి,శాలువా కప్పి సాదరంగా స్వాగతం పలికారు.అనంతరం కార్యాలయం సిబ్బంది తో సమావేశం అయ్యారు.ధరణి దరఖాస్తులు ను తనిఖీ చేసారు.నిర్ణీత కాలంలో దరఖాస్తులు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి.టి సుచిత్ర రేనా,సూపరింటెండెంట్ ప్రభాకర్,ఆర్ ఐ లు పద్మావతి,క్రిష్ణ లు ఉన్నారు.