
నష్టపోయిన గృహాలను,పొలాలను రెవిన్యూ సిబ్బంది చే సర్వే చేయిస్తామని పాల్వంచ ఆర్డీఓ డి.మధు తెలిపారు.పెద్దవాగు ప్రాజెక్ట్ కు గండి పడి గురువారం ముంపుకు గురైన నిర్వాసిత ప్రాంతాన్ని,పొలాలను ఆయన శనివారం పరిశీలించారు. ముందుగా ఆయన గడి పడిన ప్రాజెక్ట్ ను సందర్శించిన అనంతరం ముంపు నిర్వాసిత గ్రామం అయిన గుమ్మడి వల్లి లో గృహాలను,పొలాలను పరిశీలించారు.నివేదిక అందిన వెంటనే ప్రభుత్వానికి అందజేసి తదుపరి చర్యలు చేపడుతామని నిర్వాసితులకు భరోసా కల్పించారు. ఆయన వెంట తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్,ఆర్.ఐ లు క్రిష్ణ,పద్మావతి,గ్రామం పెద్దలు పుట్టా సత్యం లు ఉన్నారు.