నవతెలంగాణ – శాయంపేట
ధరణి పెండింగ్ దరఖాస్తులను ఈనెల 9 లోపు పరిష్కారం చేయాలని పరకాల ఆర్డిఓ కన్నం నారాయణ అన్నారు. శాయంపేట మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేసి ధరణి దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డిఓ మాట్లాడుతూ మండలంలో 122 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. తహసిల్దార్ దరఖాస్తులను పరిశీలించి విచారణ చేపట్టి పరిష్కరించాలని కోరారు. తిరస్కరణకు గురైన దరఖాస్తుదారునికి సేతు వారు చూపించి కారణం తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సుభాషిని, డిప్యూటీ తాసిల్దార్ ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు.