ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలి ఆర్డీవో పాండు

ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలి
ఆర్డీవో పాండు– జోగిపేటలో బైక్‌ ర్యాలీ
నవతెలంగాణ జోగిపేట
2024 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని అందోల్‌ జోగిపేట ఆర్డీవో పాండు సూచించారు. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా బుధవారం జోగిపేట పట్టణంలోని క్లాక్‌ టవర్‌ నుంచి అందోల్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 20,21 తేదీలలో కొత్త ఓటరు నమోదు కొరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ లో బీఎల్‌ఓ లు అందుబాటులో ఉంటారని, ఇప్పటికి ఓటరుగా నమోదుకానీ వారు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ ఆంటోనీ, ఎస్సై అరుణ్‌ కుమార్‌, డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఏ. గోపాల్‌, మున్సిపల్‌ సానిటరీ ఇన్స్పెక్టర్‌ వినరు కుమార్‌, ఆయా శాఖల అధికారులు నజీర్‌, నారాయణ, మేప్మా టీఎంసీ బిక్షపతి గౌడ్‌ ,వర్క్‌ ఇన్స్పెక్టర్‌ మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.