ఆర్అండ్ఆర్ సైట్ పరిశీలించిన ఆర్డీఓ రమాదేవి

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఆర్అండ్ఆర్ సైట్ ను భూపాలపల్లి ఆర్డీఓ రమాదేవి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలో నిర్మిస్తున్న సీసీరోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక వసతులను పరిశీలించారు. పనుల్లో వేగంపెంచి, నాణ్యతతో చేపట్టాలని గుత్తేదారును, సంబంధించిన అధికారులను ఆదేశించారు. అన్ని మౌలిక వసతులతో నిర్వాసితులకు  అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ పిప్పిరి శ్రీనివాస్, ఆర్ఐ సరితా పాల్గొన్నారు.