డాటా ఎంట్రీ వేగం పేంచే విధంగా చూడాలని నిజామాబాద్ ఆర్డీవో రాజేందర్ కుమార్ అన్నారు. అదివారం ఇందల్ వాయి మండల పరిషత్ కార్యాలయంలో డాటా ఎంట్రీ పనులను అకస్మీకంగా సందర్శించి పరిశీలించారు. అనంతరం మండలంలోని ఆయా గ్రామాల నుండి వచ్చిన కుటుంబ వివరాలు ఎంపిడిఓల లక్ష్మారెడ్డి, తహసిల్దార్ వెంకట్రావు లను అడిగి తెలుసుకున్నారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్వేకు సంబందించిన డాటా ఎంట్రీ చేపట్టేటప్పుడు ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా చూడాలని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ నేలా 30 వరకు డాటా ఎంట్రీ ను పూర్తి చేయాలని అదేశించిందని దానికి అనుగుణంగా వేగం పేంచి త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాజ్ కాంత్ రావు, మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్లు, పాల్గొన్నారు.