దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించాలి ఆర్డీవో వినోద్ కుమార్

నవతెలంగాణ -ఆర్మూర్ 

ఓటరు తుది జాబితా విలువరించే తేదీ నాటికి స్వీకరించిన అన్ని దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించాలని రెవిన్యూ డివిజనల్ అధికారి వినోద్ కుమార్ అన్నారు… పట్టణంలోని టీఎన్జీవో భవన్లో శనివారం నియోజకవర్గ పరిధిలోని బిఎల్ఓ లకు ఓటర్ నమోదు ప్రక్రియ, ఓటరు జాబితా పరిశీలన పై పునా సమీక్ష కార్యక్రమాన్ని నిర్వహించినారు ..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ఓటర్ల నమోదు తో పాటు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉందని,, నిర్ణీత ఫారాల్లో పూర్తి వివరాలు రాసి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.. ఓటరు తుది జాబితా,, విచారణ తర్వాత చేర్పులు సవరణలపై ముందస్తు చర్యలపై బిఎల్ఓ లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు ..ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీకాంత్,, బి ఎల్ వోలు ,,సూపర్వైజర్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.