నవతెలంగాణ – అచ్చంపేట
రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డిటి) సేవలు అభినందనీయం అని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గం పేదలు, చెంచు గిరిజనుల ఆరోగ్యం పట్ల, వారి పిల్లల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న సందర్భంగా ఆయన అభినందించారు. వందలాది మది పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వడం గొప్ప విషయం అన్నారు. ఆర్థిక స్తోమత లేని పేదలు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గుర్తించి శస్త్ర చికిత్సలు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాము. దీనికి ఆర్డిటి సంస్థ పూర్తి సహకారం అందించాలన్నారు. అనంతరం ఆర్డిటి సంస్థ కు లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, నాయకులు సంతోష్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటయ్య తదితరులు ఉన్నారు.