– 15 నుంచి తిరిగి విధుల్లోకి చేరనున్న కార్మికులు, ఉద్యోగులు
– కార్మిక నాయకులు రాములు యాదవ్
నవతెలంగాణ-జహీరాబాద్
జహీరాబాద్ మండలం కొత్తూరు(బి) గ్రామ పరిధిలో గల ట్రైడెంట్ చక్కర పరిశ్రమల యాజమాన్యం కార్మికులను, ఉద్యోగులందరినీ రీ కాల్ చేసిందని.. దీంతో ఈనెల 15 నుంచి వారందరూ ఉద్యోగాల్లోకి వెళ్లనున్నట్టు కార్మిక నాయ కులు రాములు యాదవ్ తెలిపారు. సోమవారం స్థానిక పరిశ్రమ ఆవరణలో కార్మికులతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు రోజుల క్రితం పరిశ్రమ ఎం.డితో చర్చలు జరిపి కార్మికులకు రావాల్సిన వేతనాల గురించి, పరిశ్రమలో క్రషింగ్ ప్రారం భించేందుకు, కార్మికులలో విధుల్లోకి తీసుకొని వారి బకాయి డబ్బులు చెల్లించేందుకు అగ్రిమెంట్ చేసుకున్నట్టు చెప్పారు. పరిశ్రమలో ఈ సంవత్సరం క్రషింగ్ నడవదుని, కార్మికులను విధుల్లోకి తీసుకోరని రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్న తరుణంలో యజమాన్యం ముందుకు వచ్చి పరిశ్రమను నడిపించేందుకు ఉత్సాహాన్ని చూపడం హర్షించదగ్గ విషయ మన్నారు. కార్మికులకు రావాల్సిన ఒక నెల జీతాన్ని కూడా యజమాన్యం చెల్లించిందన్నారు. మిగతా డబ్బులను పరిశ్రవలో క్రషింగ్ ప్రారంభం అనంతరం చెల్లించడానికి ఒప్పు కు న్నారన్నారు. కార్మికులకు రావాల్సిన ఎల్‌ఐసి, పిఎఫ్‌ల తోb ాటు ఓటి డబ్బులు ఇంకా రెండున్నర కోట్లు యజవన్యం చెల్లించాల్సి ఉందన్నారు. పరిశ్రమను దిగ్విజయంగా నడ ిపించి నూతన యజమాన్యానికి లాభాలు తెచ్చిపెట్టేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని కార్మికులు కూడా యాజ మాన్యానికి తెలిపారన్నారు. ఈ చక్కర పరిశ్రమ కొనసాగితే రైతులు, కార్మికులుతోపాటు పరిశ్రమపై ఆధారపడి ఉన్న ఎంతోమందికి లాభం చేకూరుతుందని కార్మికులు కూడా విధులు నిర్వహించేందుకు ముందుకు వచ్చారన్నారు. బకా యిల ఇప్పించేందుకు కషిచేసిన ప్రభుత్వానికి, ఎమ్మెల్యే మాణిక్‌రావుకు, కలెక్టర్, అధికారులకు రాములు యాదవ్ కతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కార్మిక యూ నిj ున్ నాయకులు రాజరత్నం, శ్రీనివాస్, రాజశేఖర్, రాజ్ కుమార్, జగదీష్ ,శేఖర్, తుకా రాం, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్మి కులు రాములు యాదవ్‌కు మిఠాయిలు తినిపించి సంబురాలు నిర్వహించారు.