గుంటూరు : ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శనివారం నగరంపాలెంలోని ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటైల్ ఎక్స్‌పో 2024కు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ గుంటూరు రీజినల్ హెడ్ ఎస్ జవహార్ మాట్లాడుతూ.. అతి తక్కువ వడ్డీ రేటుతోనే గృహ, వాహన రుణాలు అందిస్తున్నామన్నారు. రూ.40 లక్షల వరకు పూచికత్తు లేని విద్యా రుణాలు జారీ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పలువురు ఖాతాదారులకు రుణ మంజూరు పత్రాలను ఆయన అందజేశారు. ఈ ప్రదర్శనకు క్రెడారు చైర్మెన్ ఆళ్ళ శివారెడ్డి, ఆ బ్యాంక్ డిప్యూటీ రీజినల్ హెడ్ అశ్వర్థ నాయక్, రిటైల్ లోన్ పాయింట్ హెడ్ రామాంజనేయ కుమార్, బ్రాంచి మేనేజర్లు హాజరయ్యారు. బిల్డర్లు, కారు డీలర్లు, ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు పాల్గొన్నారు.